'భూల్ భులయ్యా 2'కు సూపర్బ్ ఓపెనింగ్స్.. ఊపిరి పీల్చుకున్న బాలీవుడ్!
on May 21, 2022
చాలా కాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతూ, తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ వస్తోన్న బాలీవుడ్, లేటెస్ట్గా రిలీజైన 'భూల్ భులయ్యా 2' మూవీ ఓపెనింగ్ కలెక్షన్లతో హాయిగా ఊపిరి పీల్చుకుంది. ఆడియెన్స్ నుంచి గొప్ప స్పందన అందుకున్న ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర అందుకు అనుగుణమైన ఓపెనింగ్స్ వచ్చాయి. కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ జంటగా నటించిన 'భూల్ భులయ్యా 2' సినిమా మే 20న ప్రపంచవ్యాప్తంగా రిలీజయ్యింది. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం తొలిరోజు ఆ మూవీ మనదేశంలో రూ. 14.11 కోట్లను కలెక్ట్ చేసింది. ఈ హారర్ కామెడీకి డబుల్ డిజిట్లో ఓపెనింగ్స్ వస్తాయని ముందుగానే ట్రేడ్ వర్గాలు వేసిన అంచనాలు నిజమయ్యాయి.
మార్నింగ్ షోస్‌కు 20 శాతం సీట్లు నిండిన థియేటర్లు రాత్రికి 50 శాతం సీట్లకు చేరుకున్నాయి. రోజు మొత్తమ్మీద సగటున థియేటర్లలో 35 శాతం సీట్లు నిండాయి. తక్కువ టికెట్ రేట్లతోనూ రూ. 14.11 కోట్లు రావడం ఈ సినిమా బిజినెస్‌తో సంబంధం ఉన్న వాళ్లందర్నీ ఆనందింపజేసింది. బాలీవుడ్‌లోని వరుస ఫ్లాపులకు 'భూల్ భులయ్యా 2' అడ్డుకట్ట వేసిందనీ, కార్తీక్ ఆర్యన్ కెరీర్‌లోని బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయనీ ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
పెంచిన టికెట్ రేట్లతో తొలిరోజు 'ఆర్ఆర్ఆర్' హిందీ వెర్షన్‌కు మల్టీప్లెక్స్‌లలో తొలిరోజు రూ. 8.25 కోట్లు రాగా, 25 శాతం తక్కువ టికెట్ రేట్లు ఉన్నప్పటికీ 'భూల్ భులయ్యా 2'కు తొలిరోజు మల్టీప్లెక్స్‌లలో రూ. 7.50 కోట్లు రావడం గమనార్హం.
అనీస్ బజ్మీ డైరెక్ట్ చేసిన 'భూల్ భులయ్యా 2'లో టబు, రాజ్‌పాల్ యాదవ్ కీలక పాత్రలు చేశారు. అక్షయ్ కుమార్, విద్యా బాలన్ ప్రధాన పాత్రలు పోషించిన 'భూల్ భులయ్యా' పార్ట్ 1 ఘనవిజయం సాధించింది. నిజానికి 2020 జూలై 31న రావాల్సిన సెకండ్ పార్ట్ కొవిడ్ కారణంగా ఆలస్యంగా మన ముందుకు వచ్చింది.
Also Read